Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Nov 2026IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో బాలికలను వేధించినందుకు షెహబాజ్ హుస్సేన్, మహ్మద్ తౌఫీక్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులను పోలీసులు వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మహిళలను వేధించినందుకు ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు వీధుల్లో ఊరేగించిన మాట వాస్తవమే అయినప్పటికీ, నిందితులు హిందువులు, ముస్లింలు కారు. అరెస్టయిన వ్యక్తులను సుభాష్ పాల్, దక్ష్ పాల్‌గా పోలీసులు అధికారికంగా గుర్తించారు.

Checked by FACTLY6 Nov 2026IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్ పార్లమెంటులో ముస్లిం ఎంపీలు అందరూ కలిసి నమాజ్ చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని జోర్డాన్ పార్లమెంటులో 2026 నవంబర్ 3న ఎంపీలు మధ్యాహ్నం (దుహర్) నమాజ్ చేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. ఇజ్రాయెల్ పార్లమెంటులో ముస్లిం ఎంపీలు నమాజ్ చేసినట్లు ఎలాంటి వార్తలు లేవు.

Checked by FACTLY6 Nov 2026IndiaTelugu
Social media posts

“న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రపంచంలో ఉనికిలోనే లేని “టొరెంజో” అనే దేశం నుండి వచ్చిన ఒక ప్రయాణికురాలిని చూపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ప్రచారం పూర్తిగా కల్పితం, అసలు ఇలాంటి ఘటన జరిగినట్లు ఆధారాలు లేవు. వైరల్ వీడియో వాస్తవానికి 2004లో ప్రసారమైన ‘ఎయిర్‌లైన్’ అనే అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్‌లోని ఒక దృశ్యం. ఫుటేజ్‌లో లాస్ ఏంజెలెస్‌కు ప్రయాణించిన ఒక అరబిక్ మాట్లాడే వృద్ధు…

Checked by FACTLY5 Nov 2026IndiaTelugu
Social media posts

“బీహార్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసిన నిజమైన ఘటనను ఈ వీడియో చూపిస్తోంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఇది బీహార్‌లో నిజంగా జరిగిన కిడ్నాప్ ఘటన కాదు. Isa Stuntతో కలిసి వీడియోలు చేసే ముక్లేసుర్ అలీ (Muklesur Ali) ఈ ఘటన ముందుగా ప్లాన్ చేసి చిత్రీకరించిందని, వీడియోలో కనిపించిన వారందరూ తన టీమ్ సభ్యులేనని తెలిపా…

Checked by FACTLY4 Nov 2026IndiaWar and conflict
Social media posts

“Russian Foreign Minister Sergey Lavrov stated that India is neither a Russian ally nor a superpower and has no right to interfere in or advise Russia on its foreign policy decisions concerning Russia, Ukraine, the United States, or other countries.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral clip has been digitally manipulated by altering the original footage and adding fabricated statements about India’s relations with Russia.

Social media posts

“Visuals of Delhi Police opening fire on Congress workers during the ‘Delhi Chalo’ rally on 01 November 2026, allegedly killing four people and injuring ten.”

FACTLY rated this: FALSE

FACTLY says: These videos depict clashes between garment workers and security forces in Dhaka, Bangladesh. There were no credible reports of any such violence occurring at the Delhi rally. Delhi Police have officially refuted the ru…

Checked by FACTLY2 Nov 2026IndiaTelugu
Social media posts

“భారత ఎంపీలు కొనుగోలు చేసే కార్లు, ఏసీలు, విమాన టిక్కెట్లపై జీఎస్టీ మినహాయింపుతో పాటు టోల్ టాక్స్ మినహాయింపు, ఉచిత రైలు ప్రయాణ సదుపాయాలు పొందుతారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఎంపీలకు ఉచిత రైలు, విమాన ప్రయాణాలతో పాటు టోల్ టాక్స్ మినహాయింపు ఉన్న మాట నిజమే. కానీ, వారు కొనుగోలు చేసే కార్లు, ఏసీలుపై వారికి ఎలాంటి జీఎస్టీ మినహాయింపు లేదు. కావున, పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

Checked by FACTLY29 Oct 2026IndiaTelugu
Social media posts

“అక్టోబర్ 2026లో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు (LAC) వద్ద భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోలన్నీ పాతవి లేదా అక్టోబర్ 2026 నాటి ఘర్షణలకు సంబంధం లేనివి. ఇవి 2021, 2024, 2025 సంవత్సరాలకు చెందిన పాత ఘటనలు, జూలై 2026 నాటి అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన దృశ్యాలు.