Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 May 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన దాడులకి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2018 లో బ్రెజిల్ లోని సియారా రాష్ట్ర రాజధాని అయిన ఫోర్టాలెజాలో ఒక యువకుడిని రాళ్ళు, గొడ్డల్లతో కొట్టి చంపిన ఘటనకి సంబంధించింది. ఈ హత్యకి LGBTQ ఫోబియా కారణమై ఉండొచ్చని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ వీడియోకి పశ్చిమ బెంగాల్ కి ఎట…

Checked by FACTLY10 May 2021IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ని చూసి సమాజ్ వాది పార్టీ నేతలు దాక్కుంటున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్న ఘటన ఏప్రిల్ 2018 సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ బులంద్ షహర్ నగరంలోని నుమాయిష్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వెళ్తున్నప్పుడు, సమాజ్ వాది పార్టీకి చెందిన కొందరు నా…

Checked by FACTLY10 May 2021IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్ కార్యాలయంలో చలానా కట్టి రెమెడెసివిర్ పొందొచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇలా కలెక్టర్ కార్యాలయంలో చలానా కట్టి రెమెడెసివిర్ పొందొచ్చన్న వార్త ఫేక్ అని, కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే రెమెడెసివిర్ ఇంజక్షన్లు పొందొచ్చని చిత్తూర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. కలెక్టర్ కార్…

Checked by FACTLY9 May 2021IndiaTelugu
Social media posts

“ఆకలి తట్టుకోలేక ప్రసాదం కోసం చర్చలోకి వెళ్లారని హిందూ పిల్లలను గుండు గీసి చేట్టుకు కట్టి కొట్టారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో 2016 నుండి అనేక కథనాలతో సోషల్ మీడియాలో సర్క్యూలేషన్ లో ఉంది. మళ్ళీ ఇప్పుడు చర్చి లో ప్రసాదం అడిగినందుకు హిందూ పిల్లలను గుండు గీసి చెట్టుకు కట్టి కొట్టారు అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

Checked by FACTLY8 May 2021IndiaTelugu
Social media posts

“వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శస్తూ శశికళ చేసిన ట్వీట్”

FACTLY rated this: FALSE

FACTLY says: జగన్ మోహన్ రెడ్డిని శశికళ విమర్శించినట్టు ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ లేవు. దీనికి తోడు అసలు శశికళ పేరు మీద అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. పోస్టులో షేర్ చేసిన ట్వీట్ ఒక పేరడీ అకౌంట్ నుంచి చేసింది

Checked by FACTLY8 May 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకున్న అల్లర్ల సందర్భంలో NRC అవసరమని NSA అజిత్ దోవల్ పెట్టిన ట్వీట్”

FACTLY rated this: FALSE

FACTLY says: NSA అజిత్ దోవల్ కి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదు. అజిత్ దోవల్ పేరుతో ఉన్న ఒక ఫ్యాన్ పేజి (పేరడీ) ట్విట్టర్ అకౌంట్, ఈ ట్వీట్ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల తరువాత చోటుచేసుకున్న అల్లర్ల గురించి అజిత్ దోవల్ మీడియాతో గాని, మరే ఇతర మాధ్యమాల…

Checked by FACTLY7 May 2021IndiaTelugu
Social media posts

“2021 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన రిగ్గింగ్ ఘటన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు 2021 లో జరిగాయి. కానీ, పోస్టు లో పెట్టిన వీడియో ఇంటర్నెట్ లో కనీసం మే 2019 నుండి ఉన్నట్లుగా తెలిసింది. కావున, ఇది ఇటీవల జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వీడియో కాదు

Checked by FACTLY7 May 2021IndiaTelugu
Social media posts

“రాజమౌళి ట్వీట్: “ఏపీ రాజధానిని ఈ ఐదేళ్ళు గ్రాఫిక్స్ లో మాత్రమే చూశాం. నిజమైన రాజధాని కావాలంటే మార్పు రావాలి".”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో చెప్పినట్టుగా రాజధాని గురించి కానీ, మార్పు గురించి కానీ రాజమౌళి ఎటువంటి ట్వీట్ చేయలేదు

Checked by FACTLY7 May 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ ఫోటో ఉన్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది కోల్కతా నగరంలో స్థాపించిన I-PAC సంస్థ ఆఫీసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం మమతా బెనెర్జీ, I-PAC సంస్థ సహకారం తీసుకున్నారు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని I-PAC సంస్థ, 2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నిక…

Checked by FACTLY7 May 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ లో TMC కార్యకర్తలు ఒక హిందూ అమ్మాయిని ఎత్తుకెళ్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్ లోని భోలా జిల్లాలోని దౌలత్ఖాన్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనకి సంబంధించింది. ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆ అబ్బాయిని పెళ్ళిచేసుకొన్న ఒక హిందూ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో తీసుకెళ్తున్న…

Checked by FACTLY6 May 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసినందుకు వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాకి చెందిన 20 సంవత్సరాల యువతిని TMC కార్యకర్తలు అత్యాచారం చేసి చంపేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పింగ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 21 సంవత్సరాల యువతిని, ఇటీవల ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అత్యాచారం చేసి చంపేసారు. TMC పార్టీ కార్యకర్తలకు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు. ఆ సంఘటనకు …