Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY31 Dec 2025IndiaTelugu
Social media posts

“చైనా ఇటీవలి (డిసెంబర్ 2025లో ) నిర్వహించిన మాగ్‌లెవ్ రైలు టెస్ట్ రన్‌కు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో చైనా ఇటీవలి (డిసెంబర్ 2025) మాగ్‌లెవ్ రైలు టెస్ట్ రన్‌ కు సంబంధించింది కాదు. ఈ దృశ్యాలు నవంబర్ 2024లో జపాన్‌లో జరిగిన 500 కి.మీ/గం మాగ్లెవ్ (లీనియర్ మోటార్) రైలు యొక్క టెస్ట్ రన్‌కు సంబంధించినవి. రైలు వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన వ్య…

Checked by FACTLY31 Dec 2025IndiaTelugu
Social media posts

“ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ₹6,000 నుండి ₹10,000 కు పెంచారని, ఇది 01 జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుంది – ఎన్టీవీ వార్త కథనం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని ₹6,000 నుంచి ₹10,000కు పెంచారని, ఇది 01 జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందనే వాదనలో నిజం లేదు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద, ప్రభుత్వం ప్రస్తుతం అర్హత కలిగిన…

Checked by FACTLY31 Dec 2025IndiaTelugu
Social media posts

“రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సీనియర్ సిటిజన్ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని మాట్లాడుతూ వారి సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకాధికారాలను ఆయన డిమాండ్ చేశారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: సంజయ్ రౌత్ ‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని అన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు.

Checked by FACTLY30 Dec 2025IndiaTelugu
Social media posts

“వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా భారత సుప్రీంకోర్టు, సివిల్ రిట్ పిటిషన్ నంబర్ 2490, కేసు నంబర్ 8222/2024లో, పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని 15 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్ట్‌తో పాటు ఉన్న గెజిట్ నోటిఫికేషన్ గ్రాఫిక్ పెన్షన్ కమ్యుటేషన్‌కు సంబంధించినది కాదు, ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) & NPSకి సంబంధించినది. పైగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని 10 స…

Checked by FACTLY30 Dec 2025IndiaTelugu
Social media posts

“ఇరాన్‌లో స్త్రీలను కొనుగోలు చేసే ఒక మార్కెట్‌లో తీసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆర్యన్ రఫీక్ అనే కుర్దిష్ కళాకారిణి డైరెక్ట్ చేసిన ఒక ఆర్ట్ ప్రదర్శనను (drama) చూపిస్తుంది, ఇరాన్‌లో స్త్రీలను అమ్ముతున్న నిజమైన మార్కెట్‌ను కాదు. ఐసిస్ (ISIS) చేత కిడ్నాప్ చేయబడి, బానిసలుగా అమ్మబడిన మహిళల దుస్థితిని ఈ వీధి నాటకం చూపి…

Checked by FACTLY30 Dec 2025IndiaTelugu
Social media posts

“సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికుల దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోకు, సియాచిన్‌కు సంబంధం లేదు. ఈ వీడియో భారత పర్వతారోహకుడు నరేంద్ర కుమార్ నేతృత్వంలోని బృందం మెక్సికోలోని 5,636 మీటర్లు (18,491 అడుగులు) ఎత్తున్న పికో డి ఒరిజాబాను అధిరోహిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది.

Checked by FACTLY30 Dec 2025IndiaTelugu
Social media posts

“టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ‘రాజేంద్ర ఏ.’ వేడి కొబ్బరి నీళ్లు క్యాన్సర్ కణాలను చంపుతాయని ఒక మెసేజిలో తెలిపారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ సందేశాన్ని డాక్టర్ రాజేంద్ర ఇవ్వలేదని, అలాగే వేడి కొబ్బరి నీళ్లు క్యాన్సర్‌ను నయం చేయగలవని సూచించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని టాటా మెమోరియల్ హాస్పిటల్ స్పష్టం చేసింది. పలు వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని రిపోర్ట్ చేశాయి.

Checked by FACTLY29 Dec 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశీ హిందూ వ్యక్తి, అక్కడి ఉద్రిక్త వాతావరణాన్ని ఒక వీడియో ద్వారా చూపిస్తూ, తమను రక్షించమని కోరుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, బంగ్లాదేశీ హిందువు అక్కడి పరిస్థితులు చూపిస్తున్న నిజమైన వీడియో కాదు. ఇది AI-జనరేటెడ్ వీడియో అని, AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి.