Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY21 Jul 2026IndiaTelugu
Social media posts

“ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో కొత్తగా ప్రారంభించిన హైడ్రోజన్ రైలుపై CJP ఆందోళనకారులు రాళ్లదాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో 13 జూన్ 2026న బీహార్‌లోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ పరీక్ష అభ్యర్థులు రైళ్ల కొరతపై చేసిన ఆందోళనకు సంబంధించినది. అంతేకాకుండా, వీడియోలో ఉన్నది సాధారణ WAG-12 లోకోమోటివ్ ఇంజిన్‌తో నడుస్తున్న రైలు అని, కొత్తగా ప్రార…

Checked by FACTLY17 Jul 2026IndiaTelugu
Social media posts

“హర్యానాలోని కురుక్షేత్రలో గఫార్ అలీ అనే ముస్లిం వ్యక్తి హిందూ పూజారిపై దాడి చేస్తున్నప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: హర్యానాలోని కురుక్షేత్రలో ఆలయ పూజారిపై తన భార్యతో కలిసి దాడి చేసిన నిందితుడు పేరు పంకజ్ సైని. ఈ కేసులో నిందితులందరూ హిందూ మతానికి చెందినవారేనని, ఇందులో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు

Checked by FACTLY16 Jul 2026IndiaTelugu
Social media posts

“2026లో న్యూజిలాండ్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, “భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బీఫ్ ఉత్పత్తిదారు” అని పేర్కొన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: న్యూజిలాండ్‌లో చేసిన తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడా బీఫ్ ఉత్పత్తి లేదా బీఫ్ ఎగుమతుల గురించి ప్రస్తావించలేదు. ఆయన నిజానికి “భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద వీట్ (గోధుమల) ఉత్పత్తిదారు” అని పేర్కొన్నారు.

Checked by FACTLY15 Jul 2026IndiaTelugu
Social media posts

“రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరితీస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జరిగిన అత్యాచార ఘటనతో సంబంధం లేదు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా చందౌస్‌లో జరిగిన 2026 మొహర్రం ఊరేగింపు సందర్భంగా అబ్బాసీ అఖారా వారు ఒక సాంప్రదాయ విన్యాసాలు ప్రదర్శించినప్పుడు దీనిని చిత్రీకరిం…

Checked by FACTLY14 Jul 2026IndiaTelugu
Social media posts

“పీఎం జన్‌ధన్ యోజన పథకం ద్వారా 13 నుంచి 65 ఏళ్ల వయస్సు వారికి ₹50,000 నుండి ₹2,00,000 వరకు ఉచిత ఆర్థిక సహాయం అందుతుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: పీఎం జన్‌ధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నేరుగా ఎలాంటి ఉచిత నగదు పంపిణీ చేయడం లేదు. ఈ పథకం ద్వారా కేవలం జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్, రూపే కార్డుపై ప్రమాద బీమా, అర్హులైన వారికి గరిష్టంగా ₹10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ వంటి ప్రయోజనాలు మా…

Checked by FACTLY14 Jul 2026IndiaTelugu
Social media posts

“జంతర్ మంతర్‌లో జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలో అరుంధతి రాయ్ “కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు” అని అన్నారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో అరుంధతి రాయ్ చేసిన వ్యాఖ్యలు కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) జంతర్ మంతర్ నిరసనకు సంబంధించినవి కావు. ఇది 2010 అక్టోబర్ 21న న్యూఢిల్లీలోని ఎల్‌టీజీ ఆడిటోరియంలో జరిగిన “ఆజాదీ – ది ఓన్లీ వే అహెడ్: కన్వెన్షన్ ఆన్ కశ్మీర్” కార్యక్రమంలో ఆమె చ…

Checked by FACTLY13 Jul 2026IndiaTelugu
Social media posts

“అరుణాచల్ ప్రదేశ్‌లోకి 60 కిలోమీటర్ల మేర చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) చొరబడినప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా PLA చొరబాటును చూపడం లేదు.ఇది మణిపూర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలను చూపుతుంది. మొదటి క్లిప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు సంబంధించినది కాగా, రెండవ క్లిప్ అస్సాం రైఫిల్స్‌ను చూపుతుంది.