Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY24 Aug 2023IndiaTelugu
Social media posts

“ఇస్రోలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రతి నెల చివరి తారీఖు నాడు జీతాలు అందుతున్నాయని, ఇస్రో ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. చంద్రయాన్-3…

Checked by FACTLY24 Aug 2023IndiaTelugu
Social media posts

“ఆస్ట్రేలియాలో నివసించే ఒక భారతీయ మహిళ, తన ప్రియుడితో కలిసి తన భర్తకు పిండి చేసిన ఆపిల్ విత్తనాలను ఇచ్చి చంపింది. ఆపిల్ విత్తనాలలో సైనైడ్ విడుదల చేసే అమిగ్డాలిన్ అనే సమ్మేళనం ఉంటుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కేరళకు చెందిన ఆస్ట్రేలియాలో నివసించే మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తకు సైనైడ్ కలిపిన నారింజ రసం/ఆరంజ్ జ్యూస్ తాగించి చంపింది, ఆపిల్ గింజల పిండి ఇచ్చి కాదు. పోస్టులో చెప్పినట్టు ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది, వాటిని నమిల…

Checked by FACTLY23 Aug 2023IndiaTelugu
Social media posts

“జాంబియా దేశంలోని విక్టోరియా జలపాతంలో నరేంద్ర మోదీ చిత్రం ఆవిష్కృతమైంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో ఎడిట్ చేయబడింది, ఇందులో కనిపిస్తున్న జలపాతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పుర్వ జలపాతానివి. ఈ ఫోటో ఈ జలపాతం ఉన్న రేవా జిల్లా యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్సైటులో ఉంది

Checked by FACTLY23 Aug 2023IndiaTelugu
Social media posts

“హిందూ సనాతన ధర్మం మరియు ముస్లింల దాడి నుండి హిందూ దేవాలయాలను కాపాడడం గురించి ఆచార్య రజనీష్ మరియు తన శిష్యుడికి మధ్య జరిగిన సంభాషణ”

FACTLY rated this: FALSE

FACTLY says: రజనీష్‌కు మరియు అతని శిష్యుడికి మధ్య హిందూ సనాతన ధర్మం మరియు ముస్లింల దాడి నుండి హిందూ దేవాలయాలను కాపాడడం గురించి ఇలాంటి సంభాషణ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పైగా పోస్టులో రజనీష్‌కు ఆపాదిస్తూ చేస్తున్న వాదనలకు పూర్తి వ్యతిరేకంగా …

Checked by FACTLY23 Aug 2023IndiaTelugu
Social media posts

“నటుడు ప్రకాష్ రాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి చితకబాదారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రకాష్ రాజ్‌ సోషల్ మీడియా సైటు ‘X’లో పెట్టిన ఒక ట్వీట్ చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని ఆరోపిస్తూ కొందరు హిందూ సంఘాల నాయకులు కర్ణాటక బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రాజ్‌పై కేసు ఫైల్ చేశారు. కానీ, బనహట్ట…

Checked by FACTLY23 Aug 2023India
Social media posts

“Photo of a Maulvi enjoying whiskey in an aeroplane”

FACTLY rated this: FALSE

FACTLY says: This is an edited image. The original image does not contain a whiskey bottle and a glass on the food tray. The person seen in this photo is Maulana Fazal-Ur-Rehman, a Pakistani politician.

Checked by FACTLY23 Aug 2023IndiaTelugu
Social media posts

“ఈ way2news గ్రాఫిక్, జైలర్ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించిన వార్తను చూపుతుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ way2news గ్రాఫిక్ మార్ఫ్/ఎడిట్ చెయ్యబడింది. ఈ గ్రాఫిక్ పైన ఉన్న లింక్ (way2.co/d3k3fa) ‘లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు’ అనే వార్తా కథనానికి చెందినది

Checked by FACTLY22 Aug 2023IndiaTelugu
Social media posts

“ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ మదరసాలో ముస్లిం యువకులు వివిధ సంగీత పరికరాలతో జనగణమన గీతాన్ని వాయిస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2017 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ వీడియో ఎక్కడిదో అన్న స్పష్టత లేనప్పటికీ, ఈ వీడియోకు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు ఎటువంటి సంబంధం లేదని మాత్రం స్పష్టమవుతుంది

Checked by FACTLY22 Aug 2023IndiaTelugu
Social media posts

“పిల్లలు పుట్టడం కోసం ఒక మహిళను కాళ్ళు చేతులు కట్టేసి మురుగునీటిలో పడేసిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. అంకుర్ జటుస్కరన్ అనే కంటెంట్ క్రియేటర్, ఈ వీడియోని ఎంటర్టైన్మెంట్ మరియు ప్రజలలో సామాజిక అవగాహన పెంపొంధించాలనే ఉద్దేశంతో రూపొందించారు. ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు

Checked by FACTLY21 Aug 2023IndiaTelugu
Social media posts

“హోటల్‌లో కస్టమర్‌కు పది మందికిపైగా ఉద్యోగులు ఆతిథ్యం చేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరంలోని గార్డన్ రెస్టారెంట్ తమ హోటల్ ప్రచారం కోసం రూపొంధించిన ఒక ప్రకటన వీడియో ఇది. కస్టమర్లపై తమ సంస్థ చూపించే శ్రద్ధను చూపించడానికి ఈ ప్రకటన వీడియోని రూపొందించామని గార్డన్ రెస్టారెంట్ మీడియాకు స్పష్టం చేసింది

Checked by FACTLY21 Aug 2023IndiaTelugu
Social media posts

“ఈ ఫోటోలో ఉన్న మహిళ సుమిత్రా దేవి. ఈమె బిహార్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్ ఉద్యోగం పనిచేసి రిటైర్ అయింది, ఆమె పదవీ విరమణ వేడుకకు, సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న ఆమె ముగ్గురు కుమారులు హాజరయ్యారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోతో కూడిన కథనం పాక్షికంగా నిజం అయినప్పటికీ (సుమిత్రా దేవి జార్ఖండ్‌లో ప్యూన్/స్వీపర్ ఉద్యోగం చేసారు, బీహార్‌లో స్వీపర్ కాదు), ఫోటో సుమిత్రా దేవికి చెందినది కాదు. ఇది బ్రిటిష్ ఇండియాకు చెందిన ఒక స్వీపర్‌ని చూపుతుంది.

Checked by FACTLY21 Aug 2023IndiaTelugu
Social media posts

“గ్రామంలో అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు దళిత యువకుడిని వైసీపీ కార్యకర్తలు చెట్టుకి కట్టేసి చెప్పులతో దాడి చేసిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన 2022 జూన్‌లో విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో రిపోర్ట్ అయింది. ఈ ఘటనను రిపోర్ట్ చేసిన వార్తా కథనాల ప్రకారం ఘటనలో రాజకీయ కోణం ఉన్నప్పటికీ, పోలీసుల FIRలో మాత్రం మొబైల్ ఫోన్ దొంగతనం ఆరోపణతో వ్యక్తిని కొట్టినట్టు ఉంది. ఐతే ఈ ఘటనకు సంబంధి…