Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 May 2023IndiaTelugu
Social media posts

“స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మాత్రామే భారత దేశంపై మొదటి హక్కు ఉంటుందని, తమిళ నటుడు అజిత్ కుమార్ వ్యాఖ్యానించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: భారతదేశంపై మొదటి హక్కు స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మాత్రామే ఉంటుందని గానీ, స్వాతంత్య్రనికి ముందు బ్రిటిష్ వారితో కలిసి దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు మౌనంగా ఉండాలి లేదా దేశం విడిచి పెట్టి వెళ్లాలని గానీ అజిత్ కుమార్ ఎన్నడూ అనలేదు

Checked by FACTLY9 May 2023IndiaTelugu
Social media posts

“ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదని, స్కామ్ జరగలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ప్రామాణికతపై ఢిల్లీ రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ మంజూరు చేసే సమయంలో వారిపై చేసిన ఆరోపణలను ఈడీ రుజువు చేయనందున వారి…

Checked by FACTLY9 May 2023IndiaTelugu
Social media posts

“‘గోమాంసం తినవచ్చని వేదాలు చెపుతున్నాయి’ – RSS సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్”

FACTLY rated this: FALSE

FACTLY says: గోమాంసానికి సంబంధించి మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పైగా పోస్టులో ఆయనకు ఆపాదిస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతదేశం అంతటా గోహత్యను నిషేధించే చట్టాన్ని తేవాలని గతంలో డిమాండ్ చేసారు

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లిలో ఇద్దరు మహిళలపై ఒక చిరుత దాడి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని సంఘటన పల్నాడులో జరగలేదు. ఇది 2022 నవంబర్ నెలలో ఉత్తరాఖండ్‌లో జరిగింది

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో దిగువ కులానికి చెందిన యువకులు గంగా నదిలో స్నానం చేసినందుకు ఒక బ్రాహ్మణ పూజారి వారిని చితకబాదిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని గంగా ఘాట్ దగ్గర కొందరు పర్యాటకులు మద్యం సేవించి నదిని అపవిత్రం చేస్తున్నారని ఒక పూజారి ఆగ్రహంతో ఆ పర్యాటకులని బెత్తంతో కొడుతున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ ఘటనకు కుల వివక్ష నేపథ్యం లేదు

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జైలుకి వెళ్లే రోజు దగ్గరపడింది అని వ్యాఖ్యానించిన మంత్రి రోజా”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చెయ్యబడింది. అసలు వీడియోలో మంత్రి రోజా విలేఖరులతో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు పాపాలు పండాయి, జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావలి..” అని అన్నారు. అసలు వీడియోలో చంద్రబాబు…

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ధర్మం చేయకుంటే ఈ సారి కూడా కేసీఆర్‌కు వోటెస్తానని ఒక వ్యక్తి ప్లకార్డ్ మెడలో వేసుకొన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలోని ప్లకార్డుపై “నాకు మర్యాదగా ధర్మం చేయండి లేదంటే ఈ సారి కూడా జగన్‌కు వోటెస్తా తరువాత మీరు కూడా వచ్చి నా పక్కన కూర్చొని అడుక్కోవాలి” అని రాసి ఉంది.

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“‘ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ పార్టీల్లో బీజేపీ నాలుగో స్థానం’ – CNN సర్వే”

FACTLY rated this: FALSE

FACTLY says: CNN సంస్థ అవినీతి రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి సర్వే నిర్వహించలేదు. వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేసి తయారు చేసింది. గతంలో కూడా ఇలానే BBC/FOX/CNN మొదలైన సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ సర్వేలు చక్కర్లు కొట్టాయి

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ఇటీవల అరెస్ట్ అయిన DRDO సీనియర్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన సావర్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రదీప్ కురుల్కర్ నమస్కరిస్తున్న సావర్కర్ విగ్రహం దెర్వాన్ గ్రామంలో ఉన్న వాలవల్కర్ మెడికల్ కాలేజీ & ఆసుపత్రిలోనిది, నాగపూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంలోనిది కాదు. 26 ఫిబ్రవరి 2021లో సావర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రదీప్ కురుల్కర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో …

Checked by FACTLY5 May 2023IndiaTelugu
Social media posts

“మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల హామీ ఇచ్చాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సందర్భాలలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేసి, SC/STలకు, ఇతరులకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్‌ అమలు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో క…

Checked by FACTLY5 May 2023IndiaTelugu
Social media posts

“ఈ దేశానికి ముస్లింలు, క్రైస్తవులు మరియ సోషలిస్టులు మాత్రమే శత్రువులు, వారిని అంతమొందిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు – ఉండవల్లి అరుణ కుమార్”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసినది ఎడిట్ చేయబడిన వీడియో. దేశంలో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ, ముస్లింలపై దాడులు పాకిస్థాన్ విడిపోయినప్పటి నుండి అనేక రాష్ట్రాలలో చోటుచేసుకుంటూనే ఉన్నాయని, బీజేపీ భగవద్గీతగా భావించే గోల్వాల్కర్ రాసిన…