Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Feb 2025IndiaTelugu
Social media posts

“భారతదేశంలో ఒక ముస్లిం మహిళ లైసెన్స్ అడిగినందుకు పోలీసులపై అరవడం చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటనది, వీడియోలో మనం బంగ్లాదేశ్ పోలీస్ యూనిఫాం వేసుకున్న ముగ్గురు పోలీసులను చూడవచ్చు

Checked by FACTLY5 Feb 2025IndiaTelugu
Social media posts

“2025 బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.10,000 కోట్లు, ఉపాధి హామీ పథకం కోసం రూ.86,000 కోట్లు మరియు గ్రామీణ సడక్ యోజన కింద రూ.16,600 కోట్లు కేటాయించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2025 బడ్జెట్‌లో వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలను వైరల్ పోస్ట్ చూపించడం లేదు. పోస్ట్‌లో పేర్కొన్న కేటాయింపులు దేశవ్యాప్తంగా ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులు, అంటే దేశవ్యాప్తంగా…

Checked by FACTLY5 Feb 2025IndiaTelugu
Social media posts

“అమెరికాలోని భారతీయ వలసదారులని కాళ్ళకి, చేతులని బేడీలు వేసి భారత్ తరలిస్తున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 30 జనవరి 2025న అమెరికా నుంచి గ్వాటెమాలకు వెళ్తున్న గ్వాటెమాల దేశస్థులని చూపుతుంది. కానీ భారతీయ వలసదారులని తీసుకెళ్లిన మొదటి విమానం ఫిబ్రవరి 04న టెక్సాస్ లో బయలుదేరి ఫిబ్రవరి 05న అమృత్‌సర్ చేరుకుంది. అయితే, భారతీయ వలసదారులకు …

Checked by FACTLY5 Feb 2025IndiaTelugu
Social media posts

“కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌లో (NRDRM) 13,762 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నకిలీ నోటిఫికేషన్ అని గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్లో ఈ పేరుతో ఎటువంటి డిపార్ట్మెంట్ లేదా పథకం లేదు. జూలై 2022లో కూడా ఇదే తరహా పేరుతో ఒక నోటిఫికేషన్ ప్రచారం …

Checked by FACTLY3 Feb 2025IndiaTelugu
Social media posts

“ఒక ఆడపులికి పురుడు పోసిన పోలీస్ డాక్టర్ల నిజమైన వీడియో అని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన వీడియో. AI టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన వీడియోలను అప్లోడ్ చేసే ‘యానిమల్స్ అండ్ హీరోస్’ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తయారు చేసిన వీడియో ఇది.

Checked by FACTLY31 Jan 2025IndiaTelugu
Social media posts

“భారతదేశంలో ఇటీవల జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ ఫొటోలో కనిపిస్తున్న పురాతన అంతరిక్ష నౌకలు బయట పడ్డాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇవి AI- జనరేటెడ్ ఫోటోలు. భారతదేశంలో ఇటీవల జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ ఫొటోలో కనిపిస్తున్న పురాతన అంతరిక్ష నౌకలు బయట పడ్డాయి అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.