Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Jul 2024IndiaTelugu
Social media posts

“వేరే ఏ ఆధారం లేకుండా ఒక చెట్టు గాలిలో వేలాడుతున్నట్టు కనిపిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో చెట్టును పూర్తిగా చూపించలేదు. ఈ చెట్టు వేలాడుతున్నప్పటికీ అది పక్కనే ఉన్న ఇంకో చెట్టు కొమ్మలపై వాలింది. పక్కనున్న వేరే చెట్టుపై పడి దాని నుండి కావాల్సిన పోషకాలు, నీరు తీసుకొని ఒక కొత్త చెట్టులా పెరుగుతోంది.

Checked by FACTLY10 Jul 2024IndiaTelugu
Social media posts

“మణిపూర్ పర్యటనలో రాహుల్ గాంధీని నిరసనకారులు అడ్డుకున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో ఘటన జనవరి 2024లో అస్సాంలో జరిగిన భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేసినప్పటిది. ఈ వీడియోతో రాహులా గాంధీ ఇటీవల చేసిన మణిపూర్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY10 Jul 2024India
Social media posts

“The visuals show the accident of the Vande Bharat train.”

FACTLY rated this: FALSE

FACTLY says: The visuals show a train accident in Chile. On 20 June 2024, two people were killed and nine injured in Chile when a passenger train in a test run by Chile’s state railway company (EFE) collided with a cargo train opera…

Checked by FACTLY9 Jul 2024IndiaTelugu
Social media posts

“ఫ్రెంచ్ రైట్‌వింగ్ పార్టీ నాయకురాలు మరీన్ లీ పెన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఏడుస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోను యూరోప్1 యుట్యూబ్ చానెల్ 2021లో “ఇది మార్చి 2017లో, థామస్ సోట్టో యొక్క మార్నింగ్ షోలో జాతీయ ర్యాలీ యొక్క ఆధ్యక్షురాలు మరీన్ లీ పెన్ యొక్క అనుకరణలను, ముఖ్యంగా జీన్-జాక్వెస్ బౌర్డిన్‌ను నికోలస్ కాంటెలోప్ ఇమిటేట్ చేయడం చూసి బాగా నవ్వారు” అ…

Checked by FACTLY9 Jul 2024IndiaTelugu
Social media posts

“హజ్ యాత్రకు వాలంటీర్లుగా వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆన్-డ్యూటీగా పరిగణించి, 45 రోజుల వేతనం మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, తెలంగాణ మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలు హజ్ వాలంటీర్లను ఆన్-డ్యూటీగా పరిగణిస్తూ పూర్తి వేతనం ఇస్తున్నాయి.

Checked by FACTLY9 Jul 2024IndiaTelugu
Social media posts

“మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇస్లాంను వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఇస్లాంను విడిచి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు విశ్వసనీయమైన రిపోర్ట్స్ ఏవీ లేవు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన “ముహమ్మద్ అజారుద్దీన్” అనే వ్యక్తి ఇస్లాంను వదిలి హిందూ మతంలోకి మారడం గురించి వచ్చిన వార్తలను మాజీ క్రికెటర్…

Checked by FACTLY9 Jul 2024IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం EMPS -2024 పథకం ద్వారా ఎలక్ట్రిక్ 2-వీలర్ వాహనాల కొనుగోలుపై 60% సబ్సిడీని అందిస్తోంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: EMPS-2024 పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై గరిష్టంగా రూ.10,000 లేదా ఫ్యాక్టరీ ధరలో 15% వరకు మాత్రమే సబ్సిడీని అందిస్తోంది. భారతదేశంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ …

Checked by FACTLY9 Jul 2024IndiaTelugu
Social media posts

“NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ కేసులో నిందితులు అందరు ముస్లింలే.”

FACTLY rated this: FALSE

FACTLY says: NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో అనుమానితులుగా భావిస్తూ CBI చేసిన అరెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ ప్రకారం నిందితుల్లో ముస్లింలు, హిందువులు, ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు.

Checked by FACTLY8 Jul 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల జులై 2024లో చంద్రబాబు హైదరాబాద్‌కు రాగా ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు ఏప్రిల్ 2024లో మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజును ప్రకటించడంతో డాక్టర్ సునీల్ కుమార్ అనుచరులు లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టిన సంఘటనకు సంబంధించినవని.