Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Aug 2025IndiaTelugu
Social media posts

“ఈజిప్టులోని మ్యూజియంలో ఉన్న 4,500 సంవత్సరాల నాటి శ్రీకృష్ణ – కుచేలుడి చిత్రం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ చిత్రానికి, ఈజిప్టులోని మ్యూజియంలకు ఎలాంటి సంబంధం లేదు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ ప్రకారం, అక్కడ ఎక్కడా 4,500 సంవత్సరాల నాటి కృష్ణుడు లేదా కుచేలుడి చిత్రాలు ప్రదర్శనలో లేవు.అలాగే, ఈజిప్టులోని ఏ మ్యూజియంలోనూ వాటికి …

Checked by FACTLY8 Aug 2025IndiaTelugu
Social media posts

“సోనియా గాంధీ తన మాజీ ప్రియుడితో కలిసి ఉన్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటోలో సోనియా గాంధీతో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ. ఈ వైరల్ ఫోటో 08 ఏప్రిల్ 1996న న్యూఢిల్లీలో జరిగిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరైనప్పుడు తీసినది.

Checked by FACTLY7 Aug 2025IndiaTelugu
Social media posts

“ఆగష్టు 2025లో దుబాయిలో జరిగిన ఎమిరేట్స్ EK521 విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన 03 ఆగష్టు 2016లో జరిగింది, ఆగష్టు 2025లో కాదు. లాండింగ్ సమయంలో జరిగిన లోపాల వల్ల ఎమిరేట్స్ EK-521 విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో 282 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడగా, ఒక అగ్నిమాపక సిబ్బంది చని…

Checked by FACTLY7 Aug 2025IndiaTelugu
Social media posts

“కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టచ్ (అరెస్టు) చేస్తే తెలంగాణ తగలబడిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చెప్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ తగలబడిపోతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత T. జీవన్ రెడ్డి వ్యాఖ్యానించలేదు. నిజానికి, ఈ వ్యాఖ్యలు చేసింది ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్…

Checked by FACTLY6 Aug 2025IndiaTelugu
Social media posts

“ధర్మస్థల సామూహిక హత్యల కేసుకి సంబంధించి జూలై 2025 నుంచి జరిగిపిన తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలను చూపుతున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో ఫ్రాన్స్‌లోని రెన్నెస్ పట్టణంలో జకోబిన్స్ కన్వెంట్ ప్రాంతంలో 2011-13 మధ్య కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ 15వ శతాబ్దపు సైనికుల అస్థిపంజరాలకు సంబంధించినది. ధర్మస్థల తవ్వకాల్లో కొన్ని మనిషి ఎముకలు, పుర్రె దొరికాయని జాతీయ మీడియాలో కథనాలు…

Checked by FACTLY5 Aug 2025IndiaTelugu
Social media posts

“విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో స్పష్టం చేసింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 01 ఆగస్ట్ 2025న రాజ్యసభలో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- RINL)పై వైసీపీ (YSRCP) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో ఎక్…

Checked by FACTLY5 Aug 2025IndiaTelugu
Social media posts

“ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులను హైడ్రా పరిధి నుంచి మినహాయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారని చెప్తున్న న్యూస్ పేపర్ క్లిప్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక నకిలీ న్యూస్ పేపర్ క్లిప్. రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అలాగే, ఇది అసత్య ప్రచారం అని, హైడ్రా నుంచి ఎవరికి మినహాయింపు లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు

Checked by FACTLY5 Aug 2025IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వ అనుమతితో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయ దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చిత్రీకరించలేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు2017లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధీనంలో పనిచేసే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (SVBC-TTD) విడుదల చేసిన ఓ వీడియో నుంచి తీసుకున్నవి.