Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Aug 2025IndiaTelugu
Social media posts

“2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సయోని ఘోష్ పార్లమెంటులో అంటున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: 29 జూలై 2025న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయోని ఘోష్ ఆపరేషన్ సింధూర్ గురించి లోక్ సభలో చేసిన వ్యాఖలకు చెందిన చిన్న వీడియో క్లిప్ ఇది. తన పూర్తి సంభాషణలో ఎక్కడ కూడా తను 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో EVM స్కామ్ జరిగిందని అనలేదు.

Checked by FACTLY4 Aug 2025IndiaTelugu
Social media posts

“మొదటిసారి విమానంలో ప్రయాణిస్తూ, భయాందోళనకు గురైన ఒక ఒక ముస్లిం వ్యక్తిని ఒక హిందూ వ్యక్తి చెంప దెబ్బ కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న సంఘటన ఇండిగో విమానం 6E-138లో ఇటీవల జరిగింది. ఇందులో నిందితుడు (హఫిజుల్ రెహమాన్), బాధితుడు (హొసైన్ అహ్మద్ మజుందార్) ఇద్దరూ ముస్లిం వ్యక్తులే.

Checked by FACTLY1 Aug 2025IndiaTelugu
Social media posts

“మహారాష్ట్రలోని సతారాలో, 10వ తరగతిలో చదివే ఒక బాలిక, తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందని, ఒక ముస్లిం యువకుడు తన గొంతు కోయడానికి ప్రయత్నించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన 21 జూలై 2025న మహారాష్ట్రలోని సతారా నగరంలోని బసప్ప పేట్‌లో జరిగింది, నిందితుడి పేరు ఆర్యన్ వాఘ్మలే. ఆర్యన్ వాఘ్మలే ముస్లిం కాదని, హిందువు అని పోలీస్ అధికారులు నిర్ధారించారు, ఈ కేసులో ఎటువంటి మతపరమైన కోణం లేదు.

Checked by FACTLY31 Jul 2025IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలో కనిపిస్తున్న రోహింగ్యా వ్యక్తి, బురఖా ధరించి ఒక హిందూ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్లి పట్టుబడ్డాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 23 జూలై 2025న బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని షల్‌బాగన్ చెక్‌పోస్ట్ దగ్గర, తనిఖీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న రషీద్ అహ్మద్ అనే 27 ఏళ్ల రోహింగ్యా వ్యక్తిని ఈ వీడియో చూపిస్తుంది. అతను కాక్స్ బజార్‌లోని రోహింగ్యా క్యాంప్ నంబర్ 26కు చెంది…

Checked by FACTLY30 Jul 2025IndiaTelugu
Social media posts

“30 జూలై 2025 రష్యా భూకంపం కారణంగా రష్యా, జపాన్ దేశాలలో జరిగిన విధ్వంసాన్ని చూపుతున్న వీడియోలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలలో ఎక్కువ భాగం 30 జూలై 2025లో రష్యాలో వచ్చిన భూకంపానికి సంబంధించినవి కావు.

Checked by FACTLY30 Jul 2025IndiaTelugu
Social media posts

“సూర్యాపేటలో, శ్రీరాముడికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌కు మద్దతుగా ఎమోజీ పెట్టినందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 22 జూలై 2025న సూర్యాపేట పట్టణంలో పద్మశాలి కుల సంఘం ఎన్నికల నేపథ్యంలో జరిగిన హత్యకు సంబంధించి మృతుడి కుటుంబం మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్, కేసు FIR ప్రకారం, ‘సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవులు’ పేర…

Checked by FACTLY30 Jul 2025IndiaTelugu
Social media posts

“ఓ గున్న ఏనుగు ఉన్న చెత్తను/ఖాళీ కూల్ డ్రింక్ డబ్బాను తన తొండంతో తీసుకొని పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.