Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Jul 2026IndiaTelugu
Social media posts

“ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో సోఫాలో కూర్చున్న దళిత కార్యకర్తపై ఇతర నాయకులు దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆగ్రా బీజేపీ కార్యాలయానిది కాదు. ఇది జూలై 2025లో మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన ఘటనను చూపుతుంది. ఒక ఎన్సీపీ మంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ‘ఛావా సంఘటన్’ కార్యకర్తలపై ఎన్సీపీ నాయకులు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలివి. …

Checked by FACTLY29 Jul 2026IndiaTelugu
Social media posts

“ఈ ఫొటోలో రాహుల్ గాంధీకి కుడి వైపున ఉన్నది NEET పేపర్ లీక్ కేసు నిందితుడు, RCC కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ మోటేగాంకర్‌.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 2014 అక్టోబర్ 8న లాతూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభకు సంబంధించినది. పైగా ఈ ఫోటోలో రాహుల్ గాంధీతో ఉంది లాతూర్ సిటీ MLA అమిత్ విలాస్‌రావు దేశ్‌ముఖ్, RCC కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ మోటేగాంకర్‌ కాదు.

Checked by FACTLY28 Jul 2026IndiaTelugu
Social media posts

“జూలై 2026 ఢిల్లీలో జరిగిన CJP నిరసనలో గర్భస్రావానికి గురై సునీత అనే మహిళా హెడ్ కానిస్టేబుల్, ఆమె బిడ్డ మృతి చెందారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: CJP నిరసనల సమయంలో ఏర్పడిన తొక్కిసలాటలో ఒక మహిళా పోలీస్ అధికారి కేవలం గాయపడి చికిత్స పొందుతున్నారని, ఎవరూ మరణించలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే సదరు అధికారి గర్భవతి కాదని కూడా పోలీసులు పేర్కొన్నారు.

Checked by FACTLY28 Jul 2026IndiaTelugu
Social media posts

“జంతర్ మంతర్‌లోని కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన సందర్భంగా మహిళ చేతిలోని పాలస్తీనా జెండాను పోలీసులు లాక్కొని చింపేసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో అక్టోబర్ 2023లో పాలస్తీనీయులకు మద్దతుగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పాలస్తీనా అనుకూల నిరసనను చూపిస్తుంది. CJP నిరసనకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY27 Jul 2026IndiaTelugu
Social media posts

“CJP నిరసనకారులలో కొందరిని ఉరితీస్తే మిగతా వాళ్లు భయపడతారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో AI వాయిస్ ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో. అసలు వీడియోలో పీయూష్ గోయల్ పేపర్ లీక్ దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు తప్ప, నిరసనకారులను ఉరితీయాలని ఎక్కడా మాట్లాడలేదు.

Checked by FACTLY24 Jul 2026IndiaTelugu
Social media posts

“CJP నిరసనల్లో విధులు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ 20వేల మంది ముస్లిం, సిక్కు సైనికులు రాజీనామా చేశారంటూ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోను AI వాయిస్ ఉపయోగించి రూపొందించారు. ఇందులో ఉపయోగించిన అసలు వీడియో నవంబర్ 2025లో జరిగిన ‘ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్’ కార్యక్రమానికి సంబంధించినది. ఈ వీడియోకి ఇప్పుడు జరుగుతున్న నిరసనలకు ఎలాంటి సంబంధం లేదు. అందులో ఉపేంద్ర ద్వి…

Checked by FACTLY23 Jul 2026IndiaTelugu
Social media posts

“ఢిల్లీ CJP నిరసనలో ఒక మహిళపై ఢిల్లీ పోలీస్ అధికారి కూర్చొని ఆమె బట్టలను చింపుతున్న దృశ్యం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన ఘటనను చూపే ఫోటో కాదు. ఇది AI సాయంతో రూపొందించిన చిత్రం. Hive, OpenAI వంటి సాధనాలు కూడా ఇది AIతో రూపొందించిన చిత్రమేనని వెల్లడించాయి.

Checked by FACTLY22 Jul 2026IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో నిరసనకారులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ధర్మేంద్ర ప్రధాన్ ఎదుటే తీవ్రంగా విమర్శిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో రేణుకా చౌదరి పక్కన నిలబడి ఉన్నది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్.