Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Sep 2024IndiaTelugu
Social media posts

“ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా శ్రీరామ్ కాలనీకి వెళ్లినప్పుడు,ఆమె జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే, అక్కడ కూర్చున్న ముస్లింలు వెంటనే మీరు జై శ్రీరామ్ ఎందుకు అన్నారంటూ వ్యతిరేకించారు. అప్పుడు ఆతిశీ వెంటనే క్షమాపణలు చెప్పింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆతిశీ మార్లేనా ఢిల్లీ విద్యా మంత్రిగా ఉన్నప్పుడు 9 మార్చి 2024న ఖజూరి ఖాస్ చౌక్ సమీపంలో ఉన్న శ్రీ రామ్ కాలనీలో పాఠశాల ప్రారంభించినప్పటిది. ఆతిశీ తన ప్రసంగంలో మొదట శ్రీరామ్ కాలనీ గురించి ప్రస్తావించలేదు. దీనిపై స్థానికులు అసంతృప్తి …

Checked by FACTLY25 Sep 2024IndiaTelugu
Social media posts

“ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్న సంఘటనని ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: వాస్తవానికి ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని కన్నయ్య సింగ్ అనే యూట్యూబర్ అప్లోడ్ చేశాడు. దీన్ని కేవలం ‘వినోదం’ కోసం తయారు చేశారు అని ఇదే వీడియోలో ఒక డిస్‌క్లైమర్ ఉంది.

Checked by FACTLY24 Sep 2024IndiaTelugu
Social media posts

“తిరుపతి నుంచి వేంకటేశ్వర స్వామి స్వయంగా గొడ్డు మాంసంతో చేసిన లడ్డు తన భక్తులకు పంపాడు అని వీడియో చేసినందుకు స్థానిక హిందూ యువకులు పియూష్ మనుష్ అనే వ్యక్తిపై తమిళనాడులో దాడి చేసారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆగస్ట్ 2019లో తమిళనాడులోని సేలంలోని బీజేపీ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో బీజేపీ కార్యకర్తలు పియూష్ మానుష్‌పై దాడి చేసిన సందర్భంలోది. సంబంధం లేని పాత వీడియోను తిరుమల లడ్డు వివాదం సందర్బంగా షేర్ చేస్తున్నారు

Checked by FACTLY24 Sep 2024IndiaTelugu
Social media posts

“కర్ణాటకలోని చిక్కోడిలోని వీధిలైట్ల స్తంభాలకు పాకిస్థాన్ జెండాలను కట్టిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్నవి పాకిస్తాన్ జెండాలు కావు. అవి ఇస్లామిక్ జెండాలు. మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా అనుమతి తీసుకొని స్థానికులు ఈ జెండాలను ఏర్పాటు చేశారని చిక్కోడి పోలీసులు తెలిపారు.

Checked by FACTLY24 Sep 2024IndiaTelugu
Social media posts

“తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేసే A.R డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లింల ఆధ్వర్యంలో నడుస్తోంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: తమిళనాడులోని AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ TTDకి ప్రసాదం కోసం నెయ్యి సరఫరా చేసే సంస్థల్లో ఒకటి. దీని డైరెక్టర్లు రాజశేఖరన్ ఆర్, సూర్య ప్రభ ఆర్ మరియు శ్రీనివాసన్ ఎస్ఆర్. కానీ, వైరల్ స్క్రీన్‌షాట్‌లోని కంపెనీ పేరు AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్, ఇది …

Checked by FACTLY23 Sep 2024IndiaTelugu
Social media posts

“వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి చేతిలో బైబిల్ పట్టుకున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2020లో దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గురించి తన భార్య వై.ఎస్. విజయమ్మ రాసిన పుస్తకం ‘నాలో నాతో వైఎస్ఆర్’ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఆ కార్యక్రమంలో తీసిన వీడియోలను బట్టి వై.ఎస్. విజయమ్మ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత …

Checked by FACTLY23 Sep 2024IndiaTelugu
Social media posts

“పేజర్, వాకీటాకీ తర్వాత ఇప్పుడు లెబనాన్‌లో గొర్రెలను పేల్చి హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ దేశం దాడి చేసింది అని చెప్తున్న CNN వారి వార్తా కథనం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది వ్యంగ్యం కోసం చేసిన ఒక ఎడిటెడ్ వీడియో. దీన్ని డానీ పొలిష్‌చుక్ అనే ఒక కమెడియన్ AI ఉపయోగించి తయారు చేశాడు. అలాగే ఇజ్రాయెల్ దేశం, లెబనాన్‌లో గొర్రెలను పేల్చి హిజ్బుల్లా గ్రూప్‌పై దాడి చేసింది అని ఎటువంటి వార్తా కథనాలు లేవు.

Checked by FACTLY20 Sep 2024IndiaTelugu
Social media posts

“19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాత బస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారు”

FACTLY rated this: FALSE

FACTLY says: 19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాత బస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారు అన్నది ఫేక్ వార్త. 19 సెప్టెంబర్ 2024న, మిలాద్ ఉన్ నబి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ దగ్గర అల్ ఇండియా స…

Checked by FACTLY19 Sep 2024IndiaTelugu
Social media posts

“హిందువులందరినీ ముస్లింలుగా మారుస్తానని ఒక ముస్లిం వ్యక్తి చెప్పగానే అతనిపై మరో వ్యక్తి దాడి చేసిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన 10 సెప్టెంబర్ 2024లో ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగింది. ఒక నాటక సన్నివేశంలో భాగంగా హిందువులందరినీ ముస్లింలుగా మారుస్తానని ముస్లిం పాత్రదారుడు డైలాగ్ చెప్తున్న సందర్భంలో ఒక ప్రేక్షకుడు అతనిపై దాడి చేశాడు. …

Checked by FACTLY19 Sep 2024IndiaTelugu
Social media posts

“హిందువుల్ని ఎలా చంపాలో ట్రైనింగ్ అవుతున్న యూపీకి చెందిన ఒక ముస్లిం వ్యక్తి వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక మార్షల్ ఆర్టిస్ట్ మరియు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. ఇతని పేరు మహమ్మద్ హస్సన్. ఇతను సోషల్ మీడియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వీడియోస్ షేర్ చేస్తుంటాడు