Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Aug 2026IndiaTelugu
Social media posts

“2026 ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 25 ఆగస్టు 2026 నాటికి ఎలాంటి స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేదు. వైరల్ పోస్టులు పూర్తిగా నకిలీవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్-చెక్ విభాగం స్పష్టం చేశాయి.

Checked by FACTLY24 Aug 2026IndiaTelugu
Social media posts

“21 ఆగస్టు 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’కు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో ఢిల్లీది కాదు. 03 ఆగస్టు 2026న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో UGC నిబంధనలకు వ్యతిరేకంగా కర్ణి సేన చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకుంటున్నప్పటి దృశ్యాలివి.

Checked by FACTLY22 Aug 2026IndiaTelugu
Social media posts

“2026లో పాతబస్తీలో SIR చేయటానికి వచ్చిన బూత్‌ లెవల్ ఆఫీసర్ పై ముస్లింల దాడి చేస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించింది కాదు. ఇది 29 నవంబర్ 2023లో నెల్లూరు నగరంలోని 42వ డివిజన్‌ మన్సూర్‌ నగర్‌లో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తిపై ఫొటోలు తీసుకుంటున్నాడని, ఓటీపీ అడుగుతున్నాడని స్థానికులు అతనిపై దాడి చే…

Checked by FACTLY21 Aug 2026IndiaTelugu
Social media posts

“బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్నప్పటి ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. అసలు ఫోటోలు, వీడియోలలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆయన సరైన పద్దతిలోనే జెండాను పట్టుకున్నారు.

Checked by FACTLY20 Aug 2026IndiaTelugu
Social media posts

“జాతీయ గీతాలాపన సమయంలో ప్రధాని మోదీ నడుస్తూ నాయకులకు, ప్రజలకు అభివాదం చేస్తూ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారు, దానికి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలోని ఆడియోని ఎడిట్ చేసి జాతీయ గీతం ఆడియోను కృత్రిమంగా జోడించారు. అసలు వీడియోలో ఆ సమయంలో ఎలాంటి జాతీయ గీతాలాపన జరగలేదు.

Checked by FACTLY19 Aug 2026IndiaTelugu
Social media posts

“15 ఆగస్టు 2026న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కార్మిక, రవాణా శాఖ మంత్రి అర్జున్ సింగ్ త్రివర్ణ పతాకానికి బదులుగా బీజేపీ జెండాను ఎగురవేసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో స్వాతంత్ర్య దినోత్సవం నాటిది కాదు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా 6 జూలై 2026న నిర్వహించిన కార్యక్రమంలో ఈ వీడియోను చిత్రీకరించారు. వీడియోకు సంబంధించిన పూర్తి వెర్షన్‌లో బీజేపీ జెండా ఎగురవేసిన తర్వాత భారత జ…

Checked by FACTLY18 Aug 2026IndiaTelugu
Social media posts

“ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ఉద్దేశించి రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భారత్‌లోని ఇటలీ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటన.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ప్రకటనను భారత్‌లోని ఇటలీ రాయబార కార్యాలయం జారీ చేయలేదు. దీనిని ఒక సెటైర్ (వ్యంగ్య) X ఖాతా పోస్ట్ చేసింది.