Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Nov 2025IndiaTelugu
Social media posts

“జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తర్వాత న్యూయార్క్‌లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో 30 జూన్ 2025న మొహర్రం సందర్భంగా న్యూయార్క్ నగరంలో ముస్లింలు నిర్వహించిన 'ఆషురా' ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ర్యాలీకి న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాబ్ మమ్దానీ ఎన్నికకు ఎటువంటి సంబంధం లేదు. డెమోక్రాటిక్ పార్టీకి చెంది…

Checked by FACTLY11 Nov 2025IndiaTelugu
Social media posts

“కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా వచ్చిన ఓటర్ కార్డులను తీసి వేస్తాం అనగానే, (SIR ప్రక్రియ మొదలు పెట్టగానే) ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు రోడ్ మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది బంగ్లాదేశ్‌లో తీసిన వీడియో. దీనికి, భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌లో 4 నవంబర్ 2025న మొదలు అవకముందే, అనగా 15 సెప్టెంబర్ 2025 నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది.

Checked by FACTLY10 Nov 2025IndiaTelugu
Social media posts

“09 నవంబర్ 2025న ​​ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించలేదు. దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) య…

Checked by FACTLY10 Nov 2025IndiaTelugu
Social media posts

“టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేయలేదు. టాటా మోటార్స్ మార్కెట్లోకి ఏ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయలేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టాటా మోటార్స్ తాము ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడం లేదని స్పష్ట…

Checked by FACTLY10 Nov 2025IndiaTelugu
Social media posts

“31 అక్టోబర్ 2025న, చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల అక్టోబర్/నవంబర్ 2025లో చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే, చంద్రపూర్ జిల్లా అటవీ అధికారులు కూడా తమ పరిధిలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగలే…

Checked by FACTLY10 Nov 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్న దృశ్యాలను చూపిస్తున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్నట్లు చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో ఫేక్. అసలు ఫోటోను మార్ఫింగ్ చేస్తూ ఈ వైరల్ ఫోటోను రూపొందించారు. వాస్తవంగా, పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని సరిగానే పట్టుకున్నాడు. ఈ వైరలో ఫ…